న్యాయం కావాలి

– సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తు జరగాలి
– బీరెన్‌ సింగ్‌ ప్రభుత్వంపైనా, సీబీఐపైనా నమ్మకం లేదు
– జంతర్‌ మంతర్‌లో మణిపూర్‌ కుకీల భారీ ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సామూహిక లైంగికదాడికి గురైన మహిళలకు న్యాయం చేయాలని, కుకీలు అధికంగా ఉండే ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, హింసను ఆపాలని డిమాండ్‌ చేస్తూ మణిపూర్‌కు చెందిన కుకీలు భారీ ఆందోళన చేపట్టారు. శనివారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌లో ఉమ్మడి కుకీ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో వేలాది మంది కుకీలు పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకుని న్యాయం చేయా లని, దోషులను శిక్షించాలని నినాదాలు హౌరెత్తించారు. అధికార బీజేపీ ముఖ్యమంత్రి ఎన్‌. బీరెన్‌ సింగ్‌పైనా, సీబీఐ పైనా తమకు విశ్వాసం లేదని ప్రకటించిన కుకీ నేతలు, హింసాకాండపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తూ కోర్టును ఆశ్రయి స్తామని ప్రకటించారు. ”భారతీయులుగా గర్విస్తున్నాం. మణిపూర్‌ లోని కొన్ని సాయుధ గ్రూపులు కోరుకునేది స్వేచ్ఛ కాదు. బదులుగా రాజ్యాంగ స్వయంప్రతిపత్తి అవసరం. భౌగోళికం గా, మానసికంగా మైయితీల నుండి వేరు చేయ బడ్డాం. ఎన్‌. బీరెన్‌ సింగ్‌ హయాంలో రాష్ట్రంలో నిరంకుశ పాలన జరుగుతోంది. స్వేచ్ఛ బీరెన్‌ సింగ్‌ హయంలో కొనసాగదు. వారు మసీదుల, చర్చీలను తగులబెట్టినప్ప టికీ, చురచంద్‌ పూర్‌తో ఒక్క హిందూ మందిరం కూడా ధ్వంసం కాలేదు” అని పేర్కొన్నారు. మసీదులో ప్రార్థనలు చేస్తున్న మహిళపై మైయితీ దుండగులు నిప్పంటించారని, హత్యకు గురైన కుకీ ల మృతదేహాలు ఇంఫాల్‌కు కూడా చేరు కోలేక మార్చురీలో కుప్పలుగా పోసి ఉన్నాయని కుకీ నాయ కులు తెలిపారు. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నా రని ధ్వజమెత్తారు. కుకీ లు మయన్మార్‌ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్లగా చిత్రీకరిస్తున్నారని, అలాంటప్పుడు సరిహద్దుల్లో కాపలాకా స్తున్న సైనికులు, వారికి ఆధార్‌ కార్డులు, పాస్‌ పోర్టులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం విదూషకులా అని నేత లు ఆగ్రహంతో ప్రశ్నించారు. చివరి వరకు పోరా టాన్ని కొన సాగించాలని, విభజన లేకుండా అప్రమత్తంగా ఉండాలని నాయకులు కుకీలకు సూచించారు. ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ముందు వాటిని నిర్ధారించ కోవాలని కూడా పిలుపు నిచ్చించారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం ఆందోళన విరమించారు. నిరసన వేదిక వద్ద భారీ పోలీసు బలగాలు మోహరించాయి.
మణిపూర్‌పై ప్రధాని ప్రకటన చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు సిద్ధం
మణిపూర్‌ హింసాకాండపై చర్చ జరగకుండా పార్ల మెంట్‌లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఉభయ సభల్లో ఈ అంశంపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని ఒత్తిడి చేసే ందుకు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సోమవారం పార్లమెంట్‌ ఆవరణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సోమవారం ఆందోళన చేపట్టనున్నారు. జులై 24 సోమవారం ఉదయం 10 గంటలకు ప్రతిపక్షాల సమావేశం ముగిసిన తరువాత, నాయకులు ఉభయ సభల్లోకి ప్రవేశించే ముందు గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతారు. ప్రతిపక్షాలు ఎటువంటి సమయ పరిమితులు లేకుండా అన్ని పార్టీలు మాట్లాడటానికి అనుమతించేలా చర్చను కోరుతున్నాయి.
చర్యలు తీసుకోవాలి :రాష్ట్రాల మహిళా కమిషన్లు
మణిపూర్‌ వీడియో ఘటనపై చర్యలు తీసుకోవాలని వివిధ రాష్ట్రాల మహిళా కమిషన్లు డిమాండ్‌ చేశాయి. జాతి కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించిన ఘటనలో పాల్గొన్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, మణిపూర్‌ ప్రభుత్వాన్ని మేఘాలయ రాష్ట్ర మహిళా కమిషన్‌ కోరింది. మిజోరాం స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ ఉమెన్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ, నాగ మదర్స్‌ అసోసియేషన్‌ కూడా బాధితులకు న్యాయం చేయాలని, మహిళలకు, బలహీన వర్గాలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ మహిళా కమిషన్‌, మణిపూర్‌ ప్రభుత్వానికి లేఖలు రాశాయి.
మణిపూర్‌లో మతతత్వ శక్తుల దుష్ట ఎజెండా వల్లే హింస… పినరయి విజయన్‌
మణిపూర్‌లో మతతత్వ శక్తుల ‘దుష్ట ఎజెండా’ వల్లే హింస జరుగుతోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. మణిపూర్‌ నుంచి వెలువడుతున్న హింసాత్మక ఘటనలు ”భయంకరమైనవి”గా ఉన్నాయని పేర్కొన్నారు. ”మణిపూర్‌ హింసాత్మక ఘటనలు ప్రతి భారతీయుడి మనస్సాక్షిని ఛిద్రం చేశాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న కలహాలు మత ఉద్రిక్తతలకు ఆజ్యం పోసే దుర్మార్గపు ఎజెండా కారణంగానే జరుగుతున్నాయి. అన్ని లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు మణిపూర్‌లో శాంతి, సాధారణ స్థితిని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేయాలి” అని పేర్కొన్నారు. మణిపూర్‌లో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న జాతి హింసను భయాందోళనలతో మాత్రమే చూడగలమని ఆయన అన్నారు. మానవ స్పృహను వేధించే భయంకరమైన దృశ్యాలు ఆ రాష్ట్రం నుంచి వస్తూనే ఉన్నాయని, కుకీ కమ్యూనిటీకి చెందిన మహిళలను అల్లరి మూకలు అత్యంత నీచంగా, క్రూరమైన రీతిలో వేటాడాయని విమర్శించారు.
మణిపూర్‌లో క్రైస్తవ సమాజాన్ని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం జరుగుతోందని, గిరిజన సంఘాల చర్చిలపై విస్తృతంగా దాడులు చేసి ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికార రాజకీయాల కోసం రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మార్చే ఎజెండాను సంఫ్‌ు పరివార్‌ కలిగి ఉందని, ఈ విషయాన్ని దేశంలోని లౌకిక సమాజం గుర్తించాలని కోరారు. ఈ అంశంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం, హింస వెనుక ఉన్న సంఫ్‌ు పరివార్‌ ఎజెండా స్పష్టం అవుతోందని విమర్శించారు. మత ధ్రువీకరణను బలోపేతం చేయడానికి ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నాలను ప్రతిఘటించాలని, ఓడించడం ప్రజాస్వామ్య సూత్రాలపై నమ్మకం ఉన్న ప్రజల కర్తవ్యమని పిలుపు ఇచ్చారు.

Spread the love