నవతెలంగాణ-పాల్వంచ
పట్టణ పరిధిలో శివనగర్ ప్రాంతంలో జ్యోతి బాధవత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిజగన్ హెర్బల్ వెల్నెస్ క్లబ్ కార్యాలయమును గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంలో రమేష్ రాథోడ్ మాట్లాడుతూ ఆరోగ్యం పట్లా పూర్తి అవగాహన ఉండటం అవసరమని, శారీరక శ్రమ అత్యంత ఆవశ్యకం అనీ, ఇలాంటి వెల్నెస్ క్లబ్ ఏర్పాటు చేయటంతో జగన్ జ్యోతిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో యస్బీఐ విద్యానగర్ బ్రాంచి మేనేజర్ జగన్, ప్రముఖ వైద్యులు సురేష్ పాడ్య, బియస్ రావు, మార్గం గురువయ్య (వైస్ ఎంపీపీ) డాక్టర్ వీరు నాయక్, హరిసింగ్ రాథోడ్ రామారాజేష్, ప్రియాంక, పణి కుమార్, గీత తదితరులు పాల్గోన్నారు.