కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 10,880 క్యూసెక్కల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులుకాగా ప్రస్తుతం 681 అడుగులు ఉంది.

Spread the love