కడియం శ్రీహరి గెలుపు కష్టమే..

నవతెలంగాణ- ధర్మసాగర్ :
 నిర్లక్ష్యం చేస్తే కడియం శ్రీహరి గెలుపుకు కష్టమే అవుతుందని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుసగుసలా ఆడుకుంటున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తర్వాత ముచ్చటగా మూడవసారి శాసనసభ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించక ముందే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.ఈ నేపథ్యంలో స్టేషన్గన్పూర్ నియోజక వర్గ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని ప్రకటించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కు టికెట్టు ఇవ్వకపోవడంతో ఆ పార్టీలో మరో కొత్త నాయకుడికి పార్టీ టికెట్ ఇచ్చే అనుకూలత లేకపోవడంతో, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరికే టికెట్ ఇవ్వడం ఆ పార్టీలో సరియైన అభ్యర్థులు లేరని చెప్పకనే చెప్పవచ్చు. దాదాపు 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కడియంకి ఆ పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య నుంచి పూర్తి వ్యతిరేకత వ్యక్తం కావడం దీంతో అధిష్టానం దిగివచ్చి రాష్ట్ర రైతు బందు సమితి అధ్యక్షుడిగా నియమించడంతో టికెట్ విషయంపై కొంత సర్దు మరిగింది.దీంతో సొంత పార్టీ కార్యకర్తలు కొందరు ప్రజాప్రతినిధులు ఇటీవల కడియం శ్రీహరి ఎన్నికల ప్రచారంలో తమను పిలువకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆరోపణలను చేయడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ప్రచారంలో కొంత  నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం ఓట్లలో కొంత కోతపడే అవకాశాలు లేకపోలేదని మేధావులు చర్చించుకోవడం జరుగుతుంది. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో అవినీతి లేకుండా, సంక్షేమ పథకాలలో పారదర్శకంగా వివరిస్తానని హామీ ఇస్తున్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ పై అవినీతి ఆరోపణలు గతంలో ఇచ్చిన హామీలు దళితున్ని ముఖ్యమంత్రి చేయకపోవడం, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీ ఇవ్వకుండా ఎన్నికల ముందు దళిత బంధు పథకం తీసుకురావడం అధిక కాస్తా వారి కార్యకర్తలకి ఇవ్వడం సరైన అభ్యర్థులు ఎంపిక చేయకపోవడం కార్యకర్తల్లో, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, స్వయం ఉపాధి పథకాల కింద రుణాలు మంజూరు చేయకపోవడం, కేవలం ఎన్నికల ముందు గృహలక్ష్మి పథకాన్ని ఇచ్చినట్టే ఇచ్చి, తగ్గించి ఇవ్వడం ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర అసహనాలు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇచ్చిన హామే రాష్ట్రంలో ఉన్న బ్యాక్ లాక్ పోస్టులను భక్తి చేయకుండా ఎన్నికల ముందే ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడం వారి పాలనకు నిలువెత్తు నిదర్శనంగా వ్యక్తమౌతుంది. తెలంగాణ ఉద్యోగాలలో అక్రమంగా భక్తి అయిన ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను వారి ప్రాంతాలకు పంపించి,ఆ ఉద్యోగ ఖాళీలను తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఇస్తామని ఇచ్చిన హామీ, నిరుద్యోగులకు ఎదురుచూపే మిగిల్చింది. దేవాదుల ఎత్తిపోతల పథకం సాగునీటి పథకం రూపశిల్పిగా చెప్పబడుతున్న కడియం శ్రీహరి ఆ ప్రాజెక్టు నాలుగు వేల కోట్లతో పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ, దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావడానికి దాదాపు 15 వేల కోట్ల రూపాయల వెయ్యం పరచడం దీంతో ప్రజాధనానికి వేలకోట్ల నష్టం వాటిల్లడం, ప్రభుత్వం అప్పుల పాలు కావడం, సకాలంలో సాగునీటి అందకపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యనికి నిదర్శనం చెప్పవచ్చు. నిరుద్యోగ భృతి కల్పించకపోవడం,57 ఏళ్ల క్రింద వృద్ధాప్య పింఛన్ ఏడాది క్రితం నుండి ఇవ్వడం, రైతు రుణమాఫీ కేవలం ఎన్నికల ముందు ప్రకటించి రైతు రుణమాఫీ చేయడం, అది కాస్త కేవలం వడ్డీ కిందనే వృధా కావడం రైతుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఇన్ని సమస్యల మధ్య కడియం శ్రీహరి ఎన్నికల ప్రచారం సాగుతున్నప్పటికీ గెలుపు ఎలా ఉంటుందో అని సందేహం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తం అవుతుంది. ఇది ఇలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీని ప్రజలు విశ్వసిస్తారా లేదా అనేదే చర్చ అంశముగా మారింది. అదేవిధంగా ఇతర పార్టీలు బీఆర్ఎస్ బిఎస్పీ, డి.ఎస్.పి ఇతర పార్టీలు వారి మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించడం బిఎస్పి లాంటి పార్టీ అత్యధికంగా ఎమ్మెల్యే అభ్యర్థులను బిసి మైనార్టీలకు నిలబెడతామని చెప్పడం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి గతంలో మాదిరిగా ఓట్లు గణనీయంగా పడే అవకాశాలు ఏమీ లేవనే చెప్పవచ్చు. ఇన్ని సమస్యల మధ్య ఎన్నికల ప్రచార సజావుగా సాగిన కడియం శ్రీహరి గెలుపు అంత సులభమేమి కాదని, రాజకీయ పరిశీలకులు మేధావులు చెప్తున్నారు. గత నాలుగున్నర సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ పదవులు నిర్వహిస్తున్నప్పటికీ స్టేషన్గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిల్లో భాగస్వామిగా  సహకారం అందిస్తామని అనుకున్న, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటీకొండ రాజయ్య నిరాకరించడం, ఇరువురు ఐక్యతతో అభివృద్ధి పాటుపడిన దాఖలాలు ఏమీ లేవు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింగపురం ఇందిరా రెండవసారి ఎన్నికల బరిలో నిలబడడం మహిళ లో కొంత సానుభూతి వ్యక్తమవుతున్నాయి. బీజేపీ పార్టీ అభ్యర్థి మాజీమంత్రి మాజీ గుండె విజయ రామారావు టికెట్ కేటాయించడం అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని చెప్పకనే చెప్పవచ్చు. ఇప్పటివరకు గెలుపు అనేది ఎవరికి వారే తమదే అని ధీమా వ్యక్తం చేయడం పరిపాటిగా మారింది.
Spread the love