కాయితి లాభాన సమాజం కోసం పనిచేస్తా

– నూతన మండల అధ్యక్షునిగా బన్సీలాల్
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ : మండల కేంద్రంలో  శుక్రవారం కాయితి లాంబడాల మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా మాజీ సర్పంచ్ బన్సీలాల్ సముందర్ తాండ,ఉపాధ్యక్షులు సాబ్ చందర్లే, బామాన్ హసరాజ్, ప్రధాన కార్యదర్శి సజన్నెలాల్, కార్యదర్శి బామాన్ పాచులాల్,కోశాధికారి కుమార్ సింగ్,సలహాదారులు.మోతిలాల్ లాగ్జిరం,లను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా కాయితి లాంబడాల మండల అధ్యక్షుడు బర్దవల్ బన్సీలాల్  మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాయితి లాంబడాల సమస్యలపై నిరంతరం పోరాడుతానని, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు రాజేందర్ బామాన్,ఉప అధ్యక్షుడు నరేష్, తాండల అధ్యక్షులు,పెద్దలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love