భిన్న కాన్సెప్ట్‌తో కలశ

భిన్న కాన్సెప్ట్‌తో కలశచంద్రజ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై బిగ్‌బాస్‌ ఫేమ్‌ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్‌ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. షూటింగ్‌ పూర్తి పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది.
ఈ సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ ఆవిష్కరణ వేడుక ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ‘కలశ’ టీజర్‌ను డైరెక్టర్‌ సాగర్‌ చంద్ర ఆవిష్కరించారు. బ్యానర్‌ లోగోను వి.ఎన్‌. ఆదిత్య లాంచ్‌ చేయగా, టైటిల్‌ లోగోను యాట సత్యన్నారాయణ, మోషన్‌పోస్టర్‌ను వీరశంకర్‌లు లాంచ్‌ చేశారు.
అలాగే ఈ చిత్రంలోని సాంగ్‌ను వి.ఎన్‌. ఆదిత్య, వీరశంకర్‌, సాగర్‌చంద్ర, యాట సత్యన్నారాయణ సంయుక్తంగా విడుదల లాంచ్‌ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు కొండా రాంబాబు మాట్లాడుతూ,”కలశ’ అనే టైటిల్‌ ఈ సినిమాలోని ఒక క్యారెక్టర్‌. కలశం ఎంత పవిత్రంగా ఉంటుందో.. ఈ క్యారెక్టర్‌ కూడా అంతే పవిత్రంగా ఉంటుంది. బ్రెయిన్‌కి, హార్ట్‌కి లింక్‌ చేస్తూ రాసుకున్న సినిమా ఇది. అందరినీ ఆకట్టుకునే మంచి కథ, కథనం ఉన్న సినిమా’ అని అన్నారు.
నిర్మాత రాజేశ్వరి చంద్రజ మాట్లాడుతూ, ‘దర్శకుడు రాంబాబు చెప్పిన కథ నన్ను చాలా ఆకట్టుకుంది. ఈ కథకు కావాల్సిన కమర్షి యల్‌ హంగులను అన్నింటినీ సమకూర్చి తెరకెక్కించాం. సెన్సార్‌ సభ్యులు ఒక కట్‌ లేకుండా సర్టిఫికెట్‌ ఇవ్వడం మా తొలి విజయంగా భావిస్తున్నాను. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. మా తొలి ప్రయత్నంగా చేసిన ఈ సినిమా మిమ్మల్ని తప్పకండా అలరిస్తుంది’ అని చెప్పారు. ‘దర్శకుడు రాంబాబు ఈ సినిమా విషయంలో చాలా డీప్‌గా ఇన్వ్‌వాల్వ్‌ అయ్యారు. ముఖ్యంగా సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ల విషయంలో మరింత కేర్‌ తీసుకున్నారు. సినిమా మంచి హిట్‌ అవుతుంది’ అని సంగీత దర్శకుడు విజరు కూరాకుల చెప్పారు.

Spread the love