కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు

 అవార్డు ప్రకటించిన అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఎండ్యూరింగ్‌ సింబల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ప్రోగ్రెస్‌’గా గుర్తించి అవార్డును ప్రదానం చేసింది. అమెరికాలోని నేవెడా రాష్ట్రం హెండర్సన్‌ నగరంలో అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ నిర్వహించిన ‘వరల్డ్‌ ఎన్విరాన్మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్స్‌’ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కేటీ రామారావు ఈ అవార్డును స్వీకరించి, ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గురించి వివరించారు. అవార్డు ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఇంజనీరింగ్‌ అద్భుతమని వర్ణించారు.

Spread the love