‘ప్రభాస్ ‘కల్కి’ కోసం కొత్త వరల్డ్‌ని బిల్డ్ చేశాం. ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూస్తారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె ఫ్యాన్స్, ప్రేక్షకులు బాగా ఎంజారు చేసేలా ‘కల్కి’ ఉంటుంది’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పారు. ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ కాంబినేషన్లో రూపొందుతున్న మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఎడి’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్‌దత్ నిర్మిస్తున్నారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటీ బాంబేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్ ఫెస్ట్-23లో ‘కల్కి’ ప్రత్యేక కంటెంట్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్ర విశేషాలను షేర్ చేసుకున్నారు. ”కల్కి’ చాలా డిఫరెంట్ ఫిల్మ్. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. ఇందులో ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉండబోతున్నాయో ప్రేక్షకులు చూస్తారు. ఈ సినిమా కోసం ప్రతి అంశంపై లోతుగా అలోచించి, స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక న్యూ వరల్డ్‌ని బిల్డ్ చేశాం. ప్రేక్షకులకు అది తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. ఇందులో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, ట్రోప్స్, కాస్ట్యూమ్స్ ప్రతీదీ భారతీయ మూలంతో ముడిపడి అది భవిష్యత్‌లో ఎలా మార్పు చెందే అవకాశం ఉందనే అంశంపైన ప్రత్యేక శ్రద్ద తీసుకుని డిజైన్ చేశాం. ఇందులో ఫ్యూచర్ ప్రభాస్‌ని చూస్తారు. కల్కి ట్రైలర్ విడుదల 93రోజుల తర్వాత ఉండొచ్చు అని నాగ్ అశ్విన్ అన్నారు.