కల్కి.. విజువల్‌ మాస్టర్‌ పీస్‌

కల్కి.. విజువల్‌ మాస్టర్‌ పీస్‌ప్రభాస్‌ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడి’ చిత్ర ట్రైలర్‌ రిలీజైంది. సినిమాటిక్‌ యూనివర్స్‌ని ఎక్స్‌ట్రార్డినరీగా పరిచయం చేస్తూ రెండు నిమిషాల యాభై ఒక్క సెకన్ల నిడివి గల ట్రైలర్‌ ప్రేక్షకులను ఇండియన్‌ మైథాలజీ వరల్డ్‌లోకి తీసుకెళ్ళింది. టాప్‌ క్లాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌, వీఎఫ్‌ఎక్స్‌ అత్యద్భుతం. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్‌తో సహా పలు భాషల్లో ఈ ట్రైలర్‌ విడుదలైంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ, ‘ఒక ఫిల్మ్‌ మేకర్‌గా ఇండియన్‌ మైథాలజీ, సైన్స్‌ ఫిక్షన్‌ పట్ల నాకు చాలా ప్యాషన్‌. ఇందులో ఈ రెండు ఎలిమెంట్స్‌ని మెర్జ్‌ చేయడం మా ఆర్టిస్ట్‌లు, టీమ్‌ అద్భుతమైన ప్రతిభ, అంకితభావం వల్ల సాధ్యమైంది. ఈ ట్రైలర్‌ యావత్‌ దేశాన్ని గర్వించేలా చేస్తుంది’ అని తెలిపారు. ఈ చిత్రం ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Spread the love