కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా కల్లేపల్లి లక్ష్మయ్య నియామకం

నవతెలంగాణ – భగత్ నగర్ : కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా గా మొగిలిపాలెం మాజీ సర్పంచ్, సీనియర్ న్యాయవాది కల్లేపల్లి లక్ష్మయ్య ను నియమిస్తూ టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్  ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ చైర్మన్లుగా వడ్లూరి కృష్ణ, ప్రదీప్ కుమార్ రాజు కన్వీనర్లుగా కొత్తకొండ శంకర్, లింగంపల్లి శ్రీకాంత్, ఎండి నవాజ్, జాయింట్  కన్వీనర్లుగా తుమ్మ ప్రభాకర్ రాయికంటి కుమార్, ఐతు సృజన్, బొడ్డు రాజు, ముఖ్య సలహాదారులుగా సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, లుక్కా రాజేశం, ఎస్ కిషన్ ల ను నియమితమయ్యారు. జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి లక్ష్మయ్య  మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ , స్టేట్ జాయింట్ కన్వీనర్ భూక్య రజనీష్ , సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love