కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్శీటీ ముట్టడి..

కాళోజీ యూనివర్శిటీ పరిధిలోని ఆలైడ్ హెల్త్ సైన్స్ విద్యార్థులందరిని పాస్ చేయాలి.
– యూనివర్సిటీ తప్పులకు విద్యార్థులను బలి చేస్తారా..?
– ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు..
నవతెలంగాణ – వరంగల్
: కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్శీటీ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2022- 2023 విద్యాసంవత్సరం నుంచి బిఎస్సీ ఆలైడ్ హెల్త్ సెన్స్ కోర్సును ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని ఈ కోర్సుల్లో ప్రవేశాలు పోందిన విద్యార్థులు చదువులను యూనివర్శీటీ గాలికిదిలేసిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు విమర్శించారు. కాళోజీ హెల్త్ యూనివర్శీటీ విద్యార్థులకు వారేం చదవాలో ఆల్మనాక్ ,అకడమిక్ క్యాలెండర్, సరైన కర్య్కులమ్ ప్రకటించకుండా, యూనివర్శీటీ అమలు చేయాల్సిన నిబంధనలు కూడా పట్టించుకోకుండా పేద విద్యార్థులు భవిష్యత్ నష్టం చేశారని అన్నారు. రాష్ట్రంలో మొదటి బ్యాచ్ లో పరీక్షలు రాస్తే కేవలం 25 మంది మాత్రమే పరీక్ష లో ఉతీర్ణత సాధించారని, మిగతన వారంతా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఈ సందర్భంగా
విద్యార్థుల సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 700 మంది ఆలైడ్ హెల్త్ సైన్స్ విద్యార్థులతో కలిసి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని ముట్టడించారు. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఆలైడ్ హెల్త్ సైన్స్ కోర్సు నేడు అరకోరా వసతులతో క్లాస్ రూమ్ లేక సరైన భోజనా సదుపాయాలు, హస్టల్స్, తరగతులు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారు.
కనీసం సిలబస్ కూడా లేకుండా పరీక్షల నెల ముందు అందించడం విద్యార్థుల్లో 97% మంది ఫెయిల్ అవడానికి కారణమైందని ఆరోపించారు. వెంటనే హెల్త్ యూనివర్సిటీ వీసీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు సరైన వసతులు అలాగే ప్రతి సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించి కేటాయించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థుల ఉత్తీర్ణత 50% మార్కులు కాకుండా 40% ను పాస్ పర్సంటేజ్ గా నిర్ణయించాలని నాణ్యత గల బోధన సిబ్బంది నియమించాలి దీనితోపాటు కోర్సుకు గుర్తింపు ఇచ్చి , స్కాలర్ల షిప్ ను ముఖ్యంగా హాస్టల్ వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థి ప్రతినిధుల బృందం యూనివర్శీటీ రిజిస్టర్ సంధ్యను కలిసి సమస్యలను పరిపూర్ణంగా వివరించడంతో సానుకూలంగా స్పందించిన రిజిస్టర్ గారు ఈ సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తామని అలాగే అత్యవసరంగా ప్రిన్సిపాల్స్ లతో మీటింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఒక వారం రోజుల గడువుతో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా విద్యార్థులు నిరసనను ముగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర కిరణ్, కె.అశోక్ రెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష్య, కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్, చుక్క ప్రశాంత్, యారా ప్రశాంత్, లెనిన్ గువేరా, ఎస్ఎఫ్ఐ నాయకులు జస్వంత్, పరిమళ, వినోద్ కుమార్, ఆలైడ్ సైన్స్ విద్యార్థుల విద్యార్ధి నేతలు శివ, కిషోర్, సింధు, శ్రీధర్, అన్వేష్, సాయికిరణ్, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love