నవతెలంగాణ – హైదరాబాద్: కమల్‌హాసన్ హీరోగా దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. ‘నాయగన్’ (నాయకుడు 1987) తర్వాత దాదాపు 37 ఏండ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కమల్‌హాసన్ రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తుండగా.. త్రిష కథానాయికగా నటిస్తుంది. శింబు, అశోక్ సెల్వన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూన్ 05 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి రీలీజ్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.