నవతెలంగాణ – వాషింగ్టన్ : అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తాను వెనకబడ్డానని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. అయినప్పటికీ.. నవంబరులో జరగబోయే ఎన్నికల్లో ప్రజాశక్తితో భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా తన ఎంపిక లాంఛనమైన నేపథ్యంలో ఆమె శనివారం తొలి విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడారు. ఎన్నికలకు సుమారు నాలుగు నెలలే ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ తన విధానాలను వెల్లడిస్తూ ఓటర్లను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.