నవతెలంగాణ – ఆర్మూర్
విధి నిర్వహణలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి అని పీఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు అన్నారు. జడ్పిహెచ్ఎస్ రామ్ మందిర్ పాఠశాల పీఈటీ, పీఆర్టియు స్టేట్ అసోసియేట్ అధ్యక్షులు మేక మోహన్ దాస్ పదవి విరమణ సభ ఆదివారం పట్టణంలోని మామిడిపల్లి రెడ్డి ఫంక్షన్ హాలుయందు ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా టెన్నిస్ బాల్, క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా, వ్యాయామ ఉపాధ్యాయులుగా మోహన్ దాస్ చేసిన సేవలు సహచరులకు ఆదర్శప్రాయమని అన్నారు.. ఈ సందర్భంగా ఇట్టి సన్మాన కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి బిరెల్లి కమలాకర్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా సన్మానించారు.. జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి వెంకటేష్ గౌడ్ అతిథులుగా జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మండల్ అధ్యక్షులు ఇట్టం గోపాల్ ,డివిజన్ ఇంచార్జ్ లక్ష్మణ్ స్టేట్ అసోసియేట్ అధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చలం అర్బన్ అధ్యక్షుడు రవికుమార్ ,ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి సంగం అశోక్, ఆలూరు అధ్యక్షులు అశ్వక్ హైమద్, ప్రధాన కార్యదర్శి సాడ సంతోష్ స్టేటస్ స్టేట్ అసోసియేట్ గంగాధర్ ,, మాక్లూర్ ప్రధాన కార్యదర్శి చిలుక శ్రీనివాస్ ,నందిపేట్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, టీజీ పేట జిల్లా అధ్యక్షులు బద్దం గోపిరెడ్డి,, విద్యాసాగర్ రావు ,బి నాగేష్ గటాడి రాజేష్, పింజ సురేందర్, గంగా మోహన్, సదామస్తుల రమణ, రాజ్ కుమార్ తదితరులు ,సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయ సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.