ఆర్మూర్లో వికసించిన కమలం.. పైడి రాకేష్ రెడ్డి గెలుపు

నవతెలంగాణ- ఆర్మూర్: ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఆదివారం జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలలో అన్యోన్య తీర్పునిచ్చారు. మండలంలోని అంకాపూర్ స్వగ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి పై 29,302 ఓట్లతో గెలుపొందారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పి యు సి చైర్మన్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆశన్న గారి జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
సేవ కార్యక్రమాలే ధ్యేయంగా..
ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన పైడి రాకేష్ రెడ్డి గత కొన్ని సంవత్సరాల నుండి నీ అయ్యాక వర్గంలోని బడుగు బలహీన పేద ప్రజల కష్టాలను వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఆర్థిక సహాయం అందిస్తూ వచ్చినారు వీరి కుమార్తె పైడి సుచరిత రెడ్డి భార్య రేవతి రెడ్డి లు నిర్విరామ కృషి చేసినారు.. హైదరాబాదులో ఒక్క రూపాయికి వైద్యం అందిస్తూ సేవలను మరింత ముందుకు పెంచినారు.
ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు..
ఆర్మూర్ నూతన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ప్రజల ఆశీర్వాదంతో గెలిచానని నియోజకవర్గంలోని నిరంకుశ పాలన హత్య రాజకీయాలను రూపుమాపుతని రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి, కంచెట్టి గంగాధర్, జీవి నరసింహారెడ్డి, యామాద్రి భాస్కర్, రోహిత్ రెడ్డి, ఆకుల రాజు, శ్రీనివాస్, కౌన్సిలర్ పాలెపు రాజు దుగ్గి విజయ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love