
మండలంలోని వివిధ గ్రామాలలో బుదవారం శ్రీ రామ నవమి పురస్కరించుకొని శ్రీ సీతా సమేత శ్రీ రామ చంద్ర మూర్తి కళ్యాణo అంగరంగ వైభవంగా భక్తుల కనువిందుగా వేదపండితులు శాస్త్ర యుక్తంగా నిర్వహించారు. వేసవి కాలం సందర్భముగా భక్తులకు చలువ పందిళ్లు వేసి, మంచినీటి సౌకర్యం కల్పించారు. సంగెం గ్రామంలో ఆలయంలో నిర్వహించిన కళ్యాణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాల్ నరసింహ, పిఎసిఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ కీసరి రాంరెడ్డి, బద్దం సంజీవరెడ్డి, కాసుల కృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.