కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి: లింగయ్య యాదవ్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తక్షణమే అమలు చేయాలనీ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల కు రిజర్వేషన్లు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికలు మేని ఫెస్టో లో ప్రవేశపెట్టింది రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బి సి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.బీసీల ఓట్ల తోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బీసీలకు ఇచ్చిన హామీల ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలి అదేవిధంగా మంత్రి పదవులు , నామినేటెడ్ పదవులలో బీసీలకు ఎక్కువ శాతం అవకాశం కల్పించాలి.
Spread the love