కామారెడ్డి అందుకే కేసీఆర్ పోటీ : కేటీఆర్

కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ: కేటీఆర్‌
కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ: కేటీఆర్‌

నవతెలంగాణ కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. ఈ నియోజకవర్గం ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందని, పొత్తులో భాగంగా 2004లో కామారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకున్నామని గుర్తు చేశారు. పార్టీలోకి గంప గోవర్ధన్‌ రావడంతో బీఆర్ఎస్ బలం మరింత పెరిగిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకే కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ‘‘ కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీ చేయాలని గోవర్ధన్‌ అడుగుతారని నేను అనుకోలేదు. ఇప్పటికే అభివృద్ధిలో దూసుకుపోతున్న కామారెడ్డి నియోజకవర్గం.. రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌ బరిలోకి దిగాలని గోవర్ధన్‌ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక బలమైన ఆశయం.. దృఢసంకల్పం ఉంటాయి’’ అని కేటీఆర్‌ అన్నారు.

Spread the love