ఎస్ బీఐ ఇంటర్ రీజినల్ క్రికెట్ టోర్నీ విజేత కామారెడ్డి జట్టు

– రెండో స్థానంలో జిల్లా జట్టు
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్  18 రీజినల్  డిప్యూటీ జనరల్ మేనేజర్ సూర్యకాంత దాస్ ఆదేశాల మేరకు రీజినల్ ఏ ఒ  హెచ్ ఆర్  శ్రీకాంత్, సత్యనారాయణ, కెప్టెన్ సంజీవ్, రాజు, వినయ్ ల ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రం లోని  రాజారాం స్టేడియంలో నిర్వహించిన వన్డే ఇంటర్ రీజినల్ క్రికెట్ టోర్నమెంట్ విజేత కామారెడ్డి జట్టు నిలిచింది. ఈ టోర్నమెంట్లో అదిలాబాద్ మంచిర్యాల్ గోదావరిఖని నిజామాబాద్ కామారెడ్డి రీజినల్ ఆఫీస్ జట్టు జట్లు పాల్గొన్నాయి. వీరికి లీగ్  నాకౌట్ మ్యాచ్లు నిర్వహించారు మొదటి సెమి ఫైనల్ మ్యాచ్లో కామారెడ్డి మంచిర్యాల్ మధ్య జరిగిన మ్యాచ్లో కామారెడ్డి జట్టు మంచిర్యాల్ జట్టుపై విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది .రెండో సెమీఫైనల్ లో నిజామాబాద్ జట్టు గోదావరిఖని జట్టుపై విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది ఫైనల్ మ్యాచ్లో నిజామాబాద్ కామారెడ్డి జట్లు తెలపడగా కామారెడ్డి జట్టు నిజామాబాద్ జట్టుపై విజయం సాధించి టోర్నీ విజేతగా నిలిచింది. టోర్నీ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ సూర్యకాంత దాస్ హాజరై బ్యాటింగ్ చేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని టోర్నీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎప్పుడు బ్యాంకుల్లో బిజీగా ఉండే ఉద్యోగులు ఆటవిడుపు కోసం టోర్నమెంట్లు లలో పాల్గొనడం  గర్వకారణమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని కోరారు .అనంతరం గెలిచిన జట్టుకు మెమొంటో లను అందజేశారు. ఫైనల్ మ్యాచ్ లో మాన్ ఆఫ్ ద మ్యాచ్ గా భాస్కర్ (కామారెడ్డి) మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కె అరవింద్ (నిజామాబాద్)నిలిచారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం లు శ్రీకాంత్,  సంజీవ్ అనూపం ఆదర్శ్,  దీనానాత్ జా, ఇతర జోన్ల క్రీడాకారులు శ్యామ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love