కామారెడ్డి పాస్‌పోర్టు ఈ సేవా కేంద్రంలో అగ్నిప్రమాదం..

నవతెలంగాణ-హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హెడ్‌ పోస్టాఫీసులోని పాస్‌పోర్టు ఈ సేవా కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది విశ్వప్రయత్నాలు చేసి మంటలు ఆర్పివేశారు. కాగా, ఈ అగ్ని ప్రమాదంలో కొన్ని డాక్యుమెంట్లు, ఇతర సామగ్రి కాలిపోయాయని పోస్టాఫీస్‌ అధికారులు వెల్లడించారు. అయితే మిగతా డేటా అంతా ఆన్‌లైన్‌లో ఉందని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటేనా? మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Spread the love