నవతెలంగాణ – వరంగల్: ప్రముఖ చిట్‌ఫండ్ కంపెనీ కనకదుర్గలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్ననల్లా భాస్కర్‌రెడ్డి(35) హన్మకొండలోని హరిత కాకతీయ హోట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి నుంచి కుటుంబసభ్యుల ఫోన్లకు స్పందించని ప్రభాకర్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం హోటల్‌లో శవమై కనిపించాడు. హన్మకొండ ఎక్సైజ్ కాలనీలోని శ్రీరామ టవర్స్ అపార్ట్‌మెంటులో ఉంటున్న భాస్కర్ రెడ్డి ఈనెల 2న ఉదయం 11:30గంటలకు పని ఉందని ఇంటి వద్ద చెప్పి బయటకు వెళ్లాడు. సాయంత్రమైన ఇంటికి చేరుకోకపోవడంతో రాత్రి ఎనిమిది గంటల సమయంలో భాస్కర్‌రెడ్డికి భార్య శామిలి కాల్ చేసింది. ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని తన కోసం ఎదురుచూడవద్దని భార్యకు చెప్పాడు. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు కాల్ చేయగా ఇంటికి బయల్దేరే ముందు తానే కాల్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అయితే ఆ రోజు రాత్రి కూడా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. ఆదివారం ఉదయం భాస్కర్‌రెడ్డికి భార్య షామిలి కాల్ చేయగా స్పందించలేదు. దీంతో కంగారు పడిన ఆమె బంధు మిత్రుల సాయంతో ఆదివారం ఉదయం నుంచి తెలిసిన చోటల్లా వెతికింది. చివరగా హరిత కాకతీయ హోటల్‌లో భాస్కర్‌రెడ్డి కారు పార్కు చేసి ఉండటాన్ని గమనించారు. హరిత కాకతీయ హోటల్‌లో రూం నంబర్ 306 ప్రభాకర్‌రెడ్డి పేరుతో బుక్ చేసి ఉండటంతో అక్కడికి చేరుకుని తెరిచే ప్రయత్నం చేశారు. గది లోపలి వైపు గడియ పెట్టి ఉండటంతో సిబ్బంది సాయంతో పగులగొట్టి తెరిచి చూడగా ప్రభాకర్‌రెడ్డి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు.