సుందరయ్య ఆశయ సాధన కోసం కృషి చేయాలి: కందాల శంకర్ రెడ్డి

నవతెలంగాణ – నూతనకల్ 
నాటి తెలంగాణ సాయిధ పోరాట యోధుడు సీపీఐ(ఎం) రాష్ట్ర మాజీ కార్యదర్శి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి కోరారు. ఆదివారం మండల పరిధిలోని  చిల్పకుంట్ల లో నిర్వహించిన సుందరయ్య వర్ధంతి వేడుకలో పాల్గొని  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం ప్రజలంతా ఆర్థిక సమానత్వాన్ని సాధించడం కోసం ఎంతో కృషి చేశారని తనకున్న  వ్యవసాయ భూమిని పేద ప్రజలకు పంపిణీ చేసిన ఘనత సుందరయ్య కు ఉందని అతని పోరాట చరిత్రను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి మండల నాయకులు తొట్ల లింగయ్య బాణాల విజయ రెడ్డి గునిగంటి లింగయ్య బాణాల శివారెడ్డి తొట్ల శ్రీను ఎల్లవుల నరేష్ తొట్ల మహేష్ దాసరి వీరయ్య తొట్ల నరేష్  వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love