కందుల నారాయణరెడ్డి కారు బోల్తా… తీవ్ర గాయాలు

నవతెలంగాణ – ప్రకాశం: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జ్ కందుల నారాయణరెడ్డి  రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి దగ్గర మాజీ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టీడీపీ ఇన్‌చార్జ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురం నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆయనను 108 వాహనంలో ఎర్రగొండపాలెంట ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కందుల నారాయణరెడ్డి హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Spread the love