సమస్యలు ప్రస్తావించిన గ్రామస్థులకు కాపు రామచంద్రారెడ్డి వార్నింగ్

నవతెలంగాణ – అనంతపురం
సమస్యలు తీర్చాలన్న గ్రామస్థులకు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’లో భాగంగా అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం గోవిందవాడలో నిన్న రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. తమకు ప్రతినెలా రేషన్ రావడం లేదని, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, పక్కా ఇళ్లు మంజూరు చేయలేదని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారని వచ్చారని నిలదీశారు. అంతే, వారి మాటలతో ఆగ్రహంతో ఊగిపోయిన రామచంద్రారెడ్డి సమస్యలు అడిగితే చెప్పుతో కొడతానని హెచ్చరిస్తూ తీవ్ర పదజాలతో దూషించారు. పక్కనే ఉన్న పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తామని గ్రామస్థులను హెచ్చరించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, స్థానిక వైసీపీ నాయకులు సర్దిచెప్పడంతో గ్రామస్థులు శాంతించారు.

Spread the love