టీఎస్ యూటీఎఫ్ అశ్వారావుపేట మండల అధ్యక్షులుగా కాపుల హరినాథ్ బాబు,కార్యదర్శిగా మడకం వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆ సంఘం అశ్వారావుపేట మండలం 11 వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి బుర్రి రాజు పర్యవేక్షణలో మండల కమిటీ ని ఎన్నుకున్నారు. అధ్యక్షులు లు కే.హరి నాధ్ బాబు,ఉపాధ్యక్షులు గా బి.రవికుమార్, ఉపాధ్యక్షురాలు గా కే.విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గా మడకం వెంకటేశ్వర్లు, కోశాధికారిగా కే.మధు, సభ్యులు గా జే.వినోద్, బి.బాలాజీ, టి.శ్రీనివాసరావు, ఎస్.జ్యోతి, వెంకటకృష్ణ, జి.రాము,టి.శిరీష, ఆడిటర్ గా రావుల రాముడు, ప్రత్యేక ఆహ్వానితులు గా ఎన్.రమణయ్య, రామారావు, కన్వీనర్ గా ఎల్.అశోక్, మహిళా కమిటీ కన్వీనర్ గా ఆర్.బేబీ పద్మ, సాంస్క్రుతిక విభాగం బాధ్యులు గా కే.రాజేశ్వరి, సోషల్ మీడియా బాధ్యులుగా టి.బాలూనాయక్, అకాడమిక్ కన్వీనర్ గా కే.గంగాధర్ రావు, ఐటీడీఏ సబ్ కన్వీనర్ గా ఎస్.తిరుపతమ్మ, ఎఫ్.డబ్ల్యు.ఎఫ్ కన్వీనర్ గా వలపర్ల బాబూరావు, మండల ఇంచార్జి గా ఎం.క్రిష్ణారావు లు ఎంపికయ్యారు.