నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలో శనివారం కర్ణాటక రైతులు కొందరు హల్చల్ చేశారు. కాంగ్రెస్‌కు వ్యతి రేకంగా ఫ్లకాడ్లు ప్రదర్శిస్తూ కొడంగల్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. విష యం తెలుసుకున్న కొందరు స్థానిక కాంగ్రెస్ నాయ కులు వారిని అడ్డుకొని ఫ్లకాడ్లు చించివేశారు. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోగా పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగి కాసే పు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఎన్నికల సమయంలో స్థానికేతరులకు నిరసనల కోసం ఎలా అనుమతులు ఇస్తారంటూ పోలీసులను ప్రశ్నించారు. రైతుల నిరస నకు పోటీగా కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహిం చారు. గొడవ పెద్దదవుతున్న క్రమంలో కర్ణాటక నుం డి వచ్చిన వ్యక్తులు ఫ్లకార్డులను మార్కెట్ యార్డులో వదిలేసి వెళ్లిపోయారు. కర్ణాటక నుండి వచ్చిన వారిలో కొందరు తమ వాహనంలో వెళ్లిపోగా ఐదుగురు మాత్రం పరిగిలోనే మిగిలిపోయారు. వా రిని కాంగ్రెస్ నాయకులు గుర్తించి ప్రశ్నించగా అస లు కథ బయటపడింది. వీరంతా రూ.300 కూలి కోసం ఓ ఏజెంట్ ద్వారా రైతుల వేషంలో పరిగికి వచ్చామని తెలిపారు. వారు ఎలా చెబితే అలా చేశా మని, చివరకు వాళ్లు తమను ఇక్కడే వదిలి వెళ్లి పోయారని వాపోయారు. కర్ణాటకలోని కోట్రిక నుండి వచ్చామని రూ. 300 ఇస్తామని వాహనంలో ఎక్కించుకొని తీసుకువ చ్చారని తెలిపారు. తమను పనిచేసుకున్నాక వదిలి వెళ్ళిపోయారని కర్ణాటక వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో కరెంటు బాగానే వస్తుందని, నెలకు రూ.2 వేల పింఛన్ ఇస్తున్నారని, బస్సులో ఫ్రీగా తిరుగుతున్నామని మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు తమను బెదిరించి ఇలా చెప్పిం చారని రైతులు మాట్లాడుతున్న వీడియోను బీఆర్ ఎస్ నాయకులు విడుదల చేశారు.