కార్తీ ‘జపాన్’ ఇంట్రడక్షన్‌ వీడియో అదిరింది..

నవతెలంగాణ-హైదరాబాద్ : నటుడు కార్తీ తాజాగా నటిస్తున్న చిత్రం ‘జపాన్‌’. ఈ చిత్రానికి రాజు మురుగన్‌ దర్శకుడు. కార్తి పుట్టిన రోజు సందర్భంగా ‘జపాన్‌’ వీడియోను నేడు విడుదల చేశారు మేకర్స్‌. తెలుగు వెర్షన్‌ను విజయ్‌ దేవరకొండ లాంఛ్ చేశాడు. కొత్తదనంతో కూడిన స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొచ్చే కార్తీ ఈ సారి కూడా సూపర్ హిట్టు కొట్టబోతున్నట్టు తాజా వీడియోతో అర్థమవుతోంది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ బీజీఎం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండబోతున్నట్టు తాజా వీడియో చెబుతోంది. జపాన్ చిత్రానికి అన్బరివ్‌ యాక్షన్‌ సన్నివేశాలను కంపోజ్‌ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. జపాన్‌లో సునీల్, విజయ్‌ మిల్టన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని డ్రీమ్‌ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ ప్రభు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్బంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తాజా వీడియోతో ప్రకటించేశారు.