నవతెలంగాణ – సంగారెడ్డి : కాసాని మరణ వార్త తెలియగానే సంగారెడ్డిలో జరుగుతున్న పార్టీ రాష్ట్ర మహాసభ బహిరంగ సభ నుండి హుటాహుటిన బయలుదేరి నిన్న రాత్రి 12 గంటల సమయం లో తమ్మినేని, పోతినేని సుదర్శన్ సుజాతనగర్ వచ్చి కామ్రేడ్ ఐలయ్యకి ఘన నివాళి అర్పించారు. కామ్రేడ్ ఐలయ్య గారి పార్థీవ దేహం పై పార్టీ పతాకాన్ని ఉంచారు.
అయిలయ్య మాస్ లీడర్ అని తమ్మినేని అన్నారు. సుజాత నగర్ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కృషి చేశారని గుర్తుచేశారు. సూజాత నగర్ సర్పంచ్ గా పనిచేసిన ఆయన ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజల మధ్య ఉండి పనిచేశారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారని ఆయన మృతి పార్టీకి తీరని లోటు .. పార్టీ రాష్ట్ర కమిటీ తరపున అయిలయ్యకు నివాళులు అర్పించారు. కాసాని మరణ వార్త తెలియగానే సంగారెడ్డిలో జరుగుతున్న పార్టీ రాష్ట్ర మహాసభ బహిరంగ సభ నుండి హుటాహుటిన బయలుదేరి రాత్రి 12 గంటల సమయంలో తమ్మినేని, పోతినేని సుదర్శన్ లు సుజాతనగర్ వచ్చి కామ్రేడ్ అయిలయ్యకి ఘన నివాళి అర్పించారు. కామ్రేడ్ అయిలయ్య భౌతిక కాయంపై అరుణ పతాకాన్ని ఉంచారు.