– కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్స్ విజయవంతం
– వేలాదిగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు
నవతెలంగాణ – ఆమనగల్
నాగర్ కర్నూల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకుని శనివారం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ సమావేశాలు విజయవంతమయ్యాయి. ఈసందర్భంగా కడ్తాల్, ఆమనగల్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని ఆయన చెప్పుకొచ్చారు. కల్వకుర్తి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవికి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు.
అంతకు ముందు టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్ తదితరులు మాట్లాడారు. మల్లు రవిని అత్యధిక మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మెన్ బాలాజీ సింగ్, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, మాజీ మార్కెట్ వైస్ చైర్మెన్ గుర్రం కేశవులు, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్, మండల అధ్యక్షులు సబావత్ బిచ్యా నాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కేతావత్ హీరాసింగ్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, ఎంపీటీసీ రాములు, కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, మాజీ సర్పంచ్ పోతుగంటి శంకర్, నరేందర్ నాయక్, ఎస్సీ సెల్ బ్లాక్ అధ్యక్షులు రామకృష్ణ, మండల అధ్యక్షులు పోతుగంటి అశోక్, సేవాదళ్ అధ్యక్షులు గురిగల్ల లక్ష్మయ్య,జిల్లా నాయకులు జవాహర్ లాల్ నాయక్, హన్మా నాయక్, చందోజీ, గూడూరు భాస్కర్ రెడ్డి, యాదగిరి రెడ్డి, జహంగీర్ అలి, తులసి రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.