నవతెలంగాణ- మల్హర్ రావు: తెలంగాణ తొలి అమరుడు కాసోజ్ శ్రీకాంత చారి వర్ధంతి వేడుకలు ఆదివారం మండలంలోని కొయ్యుర్ లో మండల విశ్వ బ్రాహ్మణ సంఘము అధ్యక్షులు దెంచనాల తిరుపతి. ప్రధాన కార్యదర్శి అనుపెద్ది రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వచించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి జాతీయ బీసీ సంఘం జిల్లా ఇన్చార్జి విజయగిరి సమ్మయ్య హాజరై మాట్లాడారు. ప్రత్యేక  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం2009 సంవత్సరంలో ఢిల్లీలో ప్రాణ త్యాగం చేసిన విశ్వబ్రాహ్మణ బీసీ ముద్దుబిడ్డ కాసోజు శ్రీకాంత్ చారి తొలి అమరుడన్నారు. కాసోజు శ్రీకాంత్ చారి ఆశలు కొనసాగించాలని, ఆయన కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉండాలని ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణ  సంఘం ఉపాధ్యక్షుడు చంద్ర చారి, సీనియర్ నాయకులు బ్రహ్మచారి. తిరుపతి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రాము, మహేష్, రమణ చారి, సమ్మయ్య, మల్లయ్య, బిసి  నాయకులు భద్రపు సమ్మయ్య పాల్గొన్నారు.