నవతెలంగాణ- కాటారం
పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదు మండలాలతో కొత్తగా కాటారం డివిజన్ ను ఏర్పాటు చేసింది. కాటారం, మహాదేవపూర్, పలిమల, మహా ముత్తారం, మాల్హర్ మండలాలు ఈ డివిజన్ పరిధిలోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ డివిజన్ సంబంధించిన ప్రభుత్వ ప్రతిపాదన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై కాటారం డివిజన్ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు….