హాస్పిటల్లో కట్టాల్సిన డబ్బులను పోగొట్టుకున్న ఆ డబ్బులను వారికి అందించి సీఐటీయూ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారీరాములు శనివారం మానవత్వం చాటుకున్నారు.ఈరోజుల్లో మానవత్వం మంట కలిసి పోతున్న సమయంలో నిజాంబాద్ లోని ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్ లక్ష్మి సంబంధించిన డబ్బులు మార్గమధ్యంలో పోగొట్టుకోవడం జరిగింది. ఆ డబ్బులలో పేషెంట్ లక్ష్మికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండడంతో వాటి ఆధారంగా వారు పోగొట్టుకున్న డబ్బులను సిఐటియు అనుబంధ సంఘం ఆటో యూనియన్ అధ్యక్షులు కటారి రాములు కి దొరకడంతో వారికి క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లక్ష్మి దగ్గరికి వెళ్లి వారు పోగొట్టుకున్న డబ్బులను అందించి గొప్ప మనసు చాటుకున్నారని పలువురు ఆయనను అభినందిస్తున్నారు. సమాజ సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.