పలు కుటుంబాలకు కత్తి కార్తిక పరామర్శ

నవతెలంగాణ- దుబ్బాక రూరల్
ఇటీవలే పలు కారణాలతో మృతి చెందిన కుటుంబాలను దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ బుధవారం పరామర్శించారు.దుబ్బాక మండలం శిలాజి నగర్ పరిధిలోని టేకుల తండాలో పెంబర్తి కనకయ్య తండ్రి రాజయ్య (60),అదే గ్రామానికి చెందిన మాలోతు చంధి (65), గంభీర్ పూర్ గ్రామానికి చెందిన మీరాపురం ఎల్లవ్వ (68) , రామక్కపేట గ్రామానికి చెందిన మోతుకు సత్తయ్య ( 45) కుటుంబ సభ్యులను పరామర్శించి,ఆర్థిక సహాయం అందజేశారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు కొత్త దేవి రెడ్డి(బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దుబ్బాక), జింక కనకయ్య (మాజీ ఎంపిటిసి గంభీర్‌పూర్), దేవా గౌడ్,సిద్ది రామ గౌడ్, జనార్ధన్,శ్రీనివాస్, చక్రీయా (మాజీ సర్పంచ్) ఎల్లం, ఇరేని సాయితేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love