ఉప్పునుంతల మండలంలోని అన్ని గ్రామాలలో సూపర్వైజర్, సిడిపిఓ తనిఖీలలో భాగంగా లక్ష్మాపూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో విధి నిర్వహణ లోపం వలన, లబ్ధిదారుల సూచన మేరకు ఉన్నత అధికారులు అంగన్వాడీ టీచర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం. ఇలాంటి సంఘటనలు ఇదివరకే జరిగినప్పటికీ మల్లి తనిఖీలో భాగంగా జరిగిన సంఘటనకు వివరణ కోరగా వాటికి పొంతనలేని సమాధానం చెప్పలేక పాయసం తీసుకోవడం జరిగిందని ఇట్టి విషయాన్ని సమర్ధించవలసిన నాయకులు దీని బేసిగ్గా చేసుకుని ఉప్పునుంతల మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మండల అధ్యక్షులు కట్ట,నంత రెడ్డి అన్నారు. గతంలో వారికి అంగన్వాడీ ఉద్యోగం ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. వారు చేసిన పొరపాటు వల్ల సస్పెన్షన్ అయినప్పటికీ తిరిగి వీధిలో చేర్పించింది కాంగ్రెస్ పార్టీని గుర్తు చేశారు. కానీ ప్రజలలో ఉనికి కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లో ఎట్లైనా సరే వారి ఉనికి కాపాడుకోవాలని ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అని చూపించారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని తెలియజేశారు. అక్కడ జరిగిన సంఘటనలో స్థానిక నాయకత్వానికి గాని, శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ కు ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, తిరుపతయ్య గౌడ్,INTUC అధ్యక్షులు రామచంద్రయ్య, సింగల్ విండో డైరెక్టర్ ఆలూరు శ్రీనివాసులు,అసెంబ్లీ జనరల్ సెక్రటరీ శేఖర్ గౌడ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నారమోని భాస్కర్, లక్షమయ్య,రాంబాబు,స్వామి,నివాస్ ఖశిం తదితరులు పాల్గొన్నారు.