కౌలాస్ అంగన్ వాడి రికార్డులను పరీశీలించిన కలెక్టర్..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని కౌలాస్ గ్రామములోని అంగన్ వాడి కేంద్రంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటీల్ శనివారం నాడు ఆకస్మీకంగా సందర్శించారు. ఈ సంధర్భంగా టీచర్ ను ఆరా తీయగా ప్రజా పాలన దరఖాస్తుల స్వీకణలో ఉందని ఆయా తెలిపారు. అనంతరం పిల్లల హదరు పట్టికతో పాటు స్టాక్ రిజిష్టర్ చూపించమని కలెక్టర్ ఆయా ను కోరగా తాళం వేసి పెట్టలో ఉందని తెలిపారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని, నిత్యం పిల్లలకు అందాల్సిన ఆహరం అందించాలని సూచించారు. కలెక్టర్ తో పాటు ఎస్సీ సింధు శర్మ, ఎంపిడివో నరేష్, తదితరులు పాల్గోన్నారు.
Spread the love