కవిత కేసు విచారణ జూన్ 3 కు వాయిదా..

నవతెలంగాణ  – హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కేసులో కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ మే 10న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మద్యం కేసులో కవితతో పాటు నలుగురి పాత్రపై ఈ ఛార్జిషీట్‌లో తెలిపారు. జూన్ 3న ఈ ఛార్జిషీట్‌పై కోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కవిత, చరణ్ ప్రీత్‌లకు ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. మిగతా నిందితులు ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, దామోదర్ శర్మలు జూన్ 3న తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. దీంతో కవితను జూన్ 3న ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు.

Spread the love