కవిత జ్యూడీషియల్ రిమాండ్ మళ్ళీ పొడగింపు..

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పొడిగించింది. కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం పాలసీ కేసులో కవితను రెండు నెలల క్రితం ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత రెండు నెలలుగా ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు పలుమార్లు పొడిగించింది. అయితే తాజాగా జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్‌ను కోర్టు పొడిగించింది.

Spread the love