బెయిల్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్న కవిత

MLC Kavithaనవతెలంగాణ – ఢిల్లీ
ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఎంఎల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు. లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించి సీబీఐ కేసులో ఆమె బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. నిన్న సీనియర్ న్యాయవాది కోర్టుకు హాజరుకాకపోవడంతో విచారణ వాయిదా వేయాలని ఆమె తరఫు లాయర్ కోరారు. పదే పదే వాయిదాలు కోరడంతో జడ్జి అసహనం వ్యక్తం చేశారు. వాదనలు వినిపించకపోతే పిటిషన్ విత్‌డ్రా చేసుకోవాలని సూచించారు.

Spread the love