కవిత అరెస్ట్ ఒక బూటకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నవతెలంగాణ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. రాజకీయ కుట్రలో భాగమే కవిత అరెస్ట్ అంటూ ట్విట్ చేశారు. మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డంపెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్ ఒక బూటకం. దీన్ని బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకూడదిని, అదేస్థాయిలో ఉన్న బీజేపీ – కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీతో పొత్తుకు చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే మోడీ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కు తెర తీశారని మండిపడ్డారు.

Spread the love