కాంగ్రెస్ గెలుపుపై కవిత రియాక్షన్


నవతెలంగాణ – హైదరాబాద్:
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  కి ప్రజలు జై కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  శుభాకాంక్షలు తెలిపారు. కవిత ఏమన్నారంటే.. ‘‘ఈ ఎన్నికల్లో కష్టపడిన BRS కుటుంబ సభ్యుల కృషికి ధన్యవాదాలు. మీరు చేసిన పోరాటానికి సోషల్ మీడియా యోధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.అధికారం ఉన్నా, లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమే. మనమందరం మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దాం. కోరుట్ల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. గెలిచిన ఎమ్మెల్యేలందరికీ, కాంగ్రెస్ పార్టీకి అభినందనలు.దేవుడు తెలంగాణను ఆశీర్వదిస్తాడు’’ అని కవిత పేర్కొన్నారు.

Spread the love