మాస్‌ బీట్‌తో కేసీపీడీ.. సాంగ్‌

మాస్‌ బీట్‌తో కేసీపీడీ.. సాంగ్‌క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. అయితే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లను క్లూస్‌ టీమ్‌ కోణంలో నుంచి చూపించేందుకు ‘అథర్వ’ అనే చిత్రం రాబోతోంది.
అన్ని రకాల ఎమోషన్స్‌ కలిపి తీసిన ఈ చిత్రం నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందింది. కార్తీక్‌ రాజు, సిమ్రాన్‌ చౌదరి, ఐరా హీరో, హీరోయిన్లుగా నటించారు. మహేష్‌ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్‌ నూతలపాటి నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు.
‘ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌, పాటలు, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో మంచి బీట్‌ ఉన్న వీడియో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘కేసీపీడీ…’ అంటూ సాగే ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఊరి వాతావరణంలో ఎంతో సహజంగా ఈ పాటను తెరకెక్కించారు. భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ, శ్రీ చరణ్‌ పాకాల బాణీ, గాత్రం ఈ పాటను వినసొంపుగా, చూడముచ్చటగా మార్చేశాయి. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీని తాజాగా పోలీస్‌ డిపార్ట్మెంట్లోని క్లూస్‌, ఫోరెన్సిక్‌ విభాగం వారు వీక్షించి, ప్రశంసల వర్షం కురిపించారు. క్లూస్‌ టీంను ఇంత బాగా ఇదివరకు ఎవ్వరూ చూపించలేదని కొనియాడారు’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది. న

Spread the love