ఏప్రిల్ 27న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. కేసీఆర్ ప్రకటన

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం లోకి రాగానే మాట్లాడడం మొదలు పెట్టిన కేసీఆర్. పార్టీ పని అయిపోయిందని కొందరు అనుకుంటున్నారు అంటూ స్పీచ్ స్టార్ట్ చేశారు. బయట వాళ్ళు కాదు.. మన పార్టీ వాళ్లే బీఆర్ఎస్ పని అయిపోయింది అని ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా ఖండించదగిన విషయం అని పేర్కొన్నారు కేసీఆర్. అదే విధంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. అలాగే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలి అని తెలిపారు. ఈ ఏడాది పొడవున పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగాలి అన్నారు. అలాగే పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కమిటీలకు ఇన్చార్జిగా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. 100 శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం. ప్రజల కోసం పార్టీ నేతలు పని చేయాలి. ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం.. ప్రతి జిల్లా కేంద్రంలో మొదలు పెడతాం అని కేసీఆర్ పేర్కొన్నారు.

Spread the love