య‌శోద ఆస్ప‌త్రిలో కేసీఆర్..

నవతెలంగాణ- హైద‌రాబాద్ : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో వైద్యులు హిప్‌ రీప్లేస్‌మెంట్ శ‌స్త్ర చికిత్స ప్రారంభ‌మైంది. కేసీఆర్ కాలుజారి పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. ఆప‌రేష‌న్ థియేట‌ర్‌కు కేసీఆర్‌ను త‌ర‌లించిన‌ దృశ్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కేటీఆర్, హ‌రీశ్‌రావు, క‌విత‌, హిమాన్షు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు జ‌గ‌దీశ్ రెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, దానం నాగేంద‌ర్, మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డితో పాటు ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు కేసీఆర్‌ను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం కేసీఆర్‌ను ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లోకి త‌ర‌లించారు. కేసీఆర్ కాలు జారి ప‌డ‌డంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. తుంటి ఎముక మార్పిడి చేయాలని, కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు.

Spread the love