కేసిఆర్ ప్రభుత్వ అవినీతిమయం..

నవతెలంగాణ -నసురుల్లాబాద్ (బాన్సువాడ)
తెలంగాణలో బిఆర్ఎస్‌ ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటని, పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని కొయ్యగుట్ట వద్ద చేరుకొని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి బీఎస్పీ కార్యకర్తలతో రెండు కిలోమీటర్లు ర్యాలీతో బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహంకు పూలమాలవేసి నివాళులు అర్పించారు అక్కడే పార్టీ జెండా ను ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు చేరుకొని అక్కడ విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణాలో నిరంకుశమైన పాలన కొనసాగుతున్నదని, కెసిఆర్‌ తాను, తన కుటుంబం తరువాత తన వారసులు అనే విధంగా వ్యవహరిస్తున్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయంగా మారిందన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని గతంలో కేసీఆర్ ఇచ్చి మాట మార్చారు. కెసిఆర్ ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వమని ఆయన దుయ్యపట్టారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదన్నారు. దళిత బంధు వాహనముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా ప్రశ్నించిన అధికారులను ఏసీబీ కేసులు చేసి భయపెట్టిస్తున్నదన్నారు. ఏసీబీ కేసులో నమోదైన విషయాలలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులకు స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని, ప్రభుత్వానికి అనుకూలంగా లేని అధికారులకు 60- 70 రోజులు జైలుకు పంపుతున్నారని తెలిపారు. తెలంగాణలో మన బహుజన రాజ్యం వస్తుందని, నమ్ముతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు
అధిష్టానం అవకాశం ఇస్తే గజ్వేల్ నుంచి పోటీ
తెలంగాణ ప్రజలు నన్ను గజ్వేల్ నుంచి కూడా పోటీ చేయమని అడుగుతున్నారని పార్టీ ఆదేశానుసారం నేను తెలంగాణలో ఎక్కడి నుంచి అయిన పోటీ చేస్తాన్నారు. అధిష్టానం అవకాశం ఇస్తే తప్పకుండా గజ్వేల్ నుంచి పోటీ చేస్తానన్నారు. ఇతర పార్టీలలో ప్రస్తుతం పని చేయుచున్న కార్యకర్తలు అందరూ మా బహుజన పార్టీ బిడ్డలే వారిని కలుపుకుని రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో మేము ప్రతి నియోజకవర్గంలో స్వతంత్రంగా ఎన్నికల బరిలో నిలబడతామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల, గ్రామాల బిఎస్పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love