వ్యవసాయ పనులు చేసుకునేందుకు సిద్దమవుతున్న కేసీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ కేసీఆర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. కేసీఆర్ గజ్వేల్ నుంచి గెలిచినప్పటికీ.. కామారెడ్డి నుంచి ఓడిపోయారు. కేసీఆర్ తో పాటు చాలా మంది బీఆర్ఎస్ కి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. కేసీఆర్ ఇటీవలే ఫామ్ హౌస్ లోని బాత్ రూమ్ లో కాలు జారి పడడంతో తుంటి ఎముక విరిగిపోయిన విషయం తెలిసిందే.  తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. వంటిమామిడిలో ఉన్న ఎరువుల షాప్ యజమానికి ఫోన్ చేసి ఫామ్ హౌస్ కి విత్తనాలు, ఎరువులు పంపించాలని చెప్పారు. పది రోజుల్లో ఫామ్ హౌస్ కి వస్తానని వ్యవసాయం చూసుకుంటానన్నారు. ఆరోగ్యం గురించి వాకబు చేయగా ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు.

Spread the love