పెద్ద కొడుకులా అండగా కేసీఆర్‌

కార్పొరేటర్‌ హేమలత సురేష్‌ రెడ్డి
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజా ప్రకటన పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని సుభాష్‌ నగర్‌ 130 డివిజన్‌ కార్పొరేటర్‌ హేమలత సురేష్‌ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్‌ హేమలత సురేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ , మంత్రి కేటీఆర్‌ చిత్ర పటాలకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ వికలాంగులకు రూ. 3116 పెన్షన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వచ్చే నెల నుంచే రూ. 4116 పెన్షన్‌ అందరికీ అందుతుంది అన్నారు. దివ్యాంగులు ఈ సందర్భంగా మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సీఎం కేసీఆర్‌ తమ పాలిట దేవుడని, ఇటీవల కాలంలో కన్నబిడ్డలే చూసుకొని ఈ తరుణంలో నెల నెల పెన్షన్‌ ఇస్తూ వెయ్యి రూపాయలు పెంచి మాకు పెద్ద కొడుకులా అండగా నిలుస్తున్నారని వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం సభ్యులు, పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love