‘భూమి పుత్రుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ పత్రికా వ్యాసాల సంకలనం సన్‌ ఆఫ్‌ ది సాయిల్‌ (భూమి పుత్రుడు) పుస్తకాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. శుక్రవారంనాడిక్కడి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి టీ హరీశ్‌రావు, గాదరి బాలమల్లు, పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love