కేసీఆర్ మానస పుత్రిక సుంకిశాల..

KCR Manasa Putrika Sunkishala– సుంకిశాల’ చుట్టూ రాజకీయ దుమారం తగదు
– నిర్మాణ లోపంతోనే కుప్పకూలింది
– నిర్మాణ ఖర్చు సంస్తే భరించాలి
నవతెలంగాణ – పెద్దవూర
కేటీఆర్ మానస పుత్రిక సుంకిశాల ప్రాజెక్టు అది తండ్రి తనయులకు కాంట్రాక్టర్లకే తెలుసనీ వ్యవసాయ శాఖామంత్రి నామా నాగేశ్వర్ రావు అన్నారు. శుక్రవారం సుంకిశాల ప్రాజెక్టు కూలిన రిటైంగ్ వాల్ గేట్ల ను పరిశీలించారు ఈసందర్బంగా విలేకరుల సమావేశం మంత్రి మాట్లాడారు.సుంకిశాల ప్రాజెక్టును 2021 జులైలో నాటి కేసీఆర్ ప్ర‌భుత్వం అగ్రిమెంట్ చేసుకుందని టన్నెల్ సైడ్ వాల్‌ని జులై 2023లో పూర్తి చేశారని అన్నారు. సుంకిశాల ప్రాజెక్టు కాంగ్రెస్ క‌ట్టింది కాదు.. మా హ‌యాంలో మొద‌లు పెట్టింది కాదు. మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల‌తో పాటు సుంకిశాల కూడా బీఆర్ఎస్ పాప‌మే.. బీఆర్ఎస్ హ‌యాంలో మొద‌లు పెట్టిన మిగిలిన నిర్మాణాల ప‌రిస్థితి కూడా భ‌విష్య‌త్తులో తేలుతుంది అన్నారు. కాంగ్రెస్ రాగానే కూలిందని గత పాలకులు పత్రిక, టీవీ ఛానల్‌లో సుంకిశాల పాపం వేరొకరిదని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.మరోవైపు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ స్పందిస్తూ.. మంచి అయితే మాది.. చెడు అయితే బీఆర్ఎస్‌ది అన్నట్టు కాంగ్రెస్ సర్కారు సృష్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శలు చేశారు.సుంకిశాల ప్రాజెక్టును అందరూ వ్యతిరేకించినా,బీఆర్ఎస్ పార్టీ కేవలం కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టును ప్రారంభించిందని అన్నారు. సుంకిశాల పంప్‌హౌజ్ ప్రాజెక్టును 2021లో రూ.2,200 కోట్లకు మేఘా సంస్థ ఈ పనుల కాంట్రాక్టు దక్కించుకోగా.. ఇప్పటి వరకు రూ.1,500 కోట్లు ఖర్చు పెట్టారని ఇన్​టెక్ వెల్​లో సంపు, పంపు హౌస్​, 3 టన్నెళ్లు, పంప్ హౌస్​ సూపర్ స్ట్రక్చర్​ నిర్మిస్తున్నారని తెలిపారు.పంపింగ్ మెయిన్స్​లో 50 కి.మీ. మేర 3 వరుసల 2,325 ఎంఎం డయా పైపు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రో మెకానికల్ పనుల్లో భాగంగా పంపులు, మోటార్లు, సబ్ స్టేషన్లు, పవర్ ట్రాన్స్ మిషన్ మెయిన్స్ నిర్మిస్తున్నారు. సుంకిశాల ప్రాజెక్టు ఇన్​టెక్ వెల్ పనులు ఇప్పటి వరకు 60 శాతం, పంపింగ్ మెయిన్ పనులు 70 శాతం, ఎలక్ట్రో మెకానికల్ పనులు 40 శాతం పూర్తయ్యాయి. అయితే సాగర్ రిజర్వాయర్‌లోకి భారీ వరద చేరుకోవడంతో రిటైనింగ్ వాల్ కూప్పకూలిందని సాగర్​ రిజర్వాయర్​లోకి భారీ స్థాయిలో వరద వస్తుందని ఊహించలేకపోయామని జలమండలి అధికారులు చెప్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నదని అన్నారు.
శ్రీశైలం నుంచి సాగర్​​లోకి వరద జులై నెలాఖరు నుంచి మొదలైంది. ఆగస్టు 1న సాగర్​ నీటిమట్టం 530 అడుగులు మాత్రమే ఉంది. 590 అడుగుల నుంచి 450 అడుగుల వరకు నీటి మట్టాలు పడిపోయినా సొరంగ మార్గం ద్వారా సుంకిశాల పంపుహౌస్​​లోకి నీటిని తరలించే విధంగా డిజైన్​ చేశారు. కానీ 530 అడుగుల మేర 169 టీఎంసీల నీటి ధాటినే రిటైనింగ్​వాల్​ఆపలేకపోవడం నిర్మాణంలోని లోపాలను ఎత్తి చూపుతున్నదని అన్నారు.వాస్తవానికి పంపుహౌస్​లో మోటార్లు బిగించిన తర్వాత సొరంగం పనులు పూర్తిచేయాలసి ఉండగా ఇక్కడ అధికారులు మోటార్లు బిగించకముందే మూడు సొరంగ మార్గాల్లో మూడో మార్గాన్ని ఓపెన్​ చేసి పెట్టారు. రిటైనింగ్​ వాల్, గేట్ల నిర్మాణం పూర్తికావడం, సొరంగ మార్గాన్ని తెరిచే ఉంచడంతో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.సాగర్​లో 530 అడుగులకు నీరు చేరగానే సొరంగం గుండా పంపుహౌస్​లోకి నీరు ప్రవేశించే క్రమంలో”ఒత్తిడికి గురై, రిటైనింగ్​వాల్​ కూలిపోయింని వాటర్​ లీక్​ అవుతున్నట్టు పనిచేస్తున్న సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదనే ప్రచారంజరిగిందని తెలిపారు.ఇరిగేష్ శాఖ మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్లు కేసీఆర్ పాలనలో ఎస్ఎల్బీ సీ సొరంగపనులు పూర్తి చేసి ఉంటే సుంకి శాల ప్రాజెక్టు అవసరం లేకుండా పోయేదని అన్నారు. ఎఎంఆర్పీ నుంచి హైదరాబాద్ కు తాగునీళ్లు సక్రమంగా ఆడుతున్న కమిషన్ల కోసం 2,200 కోట్లు వెచ్చించారని విమర్శలు చేశారు.సుంకిశాల నిర్మాణ డిజయిన్ చేసింది, కాంట్రాక్టుకు, ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.సుంకిశాల నష్టం 10 నుంచి 15 కోట్లు నష్టం జరిగిందని ఇది కాంట్రాక్టు సంస్థ భరిస్తుందని ప్రభుత్వానికి ఎలాంటి నష్టము లేదని అన్నరు. ఎస్ఎల్బీ సీ సొరంగం పనులు మొత్తం 44 కిలోమీటర్లు కాగా ఇప్పటికి 35 కిలోమీటర్లు పని పూర్తిఅయిందని మరో 9 కిలోమీటర్లు పూర్తి చేసి రెండు లక్షల ఎకరాలకు సాగునిళ్ళు అధించి హైదరాబాద్ కు తాగునిటిని అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్,  డీపీఆర్ ఓ వెంకిటేశ్వర్ రావు, సాగర్ డ్యామ్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, మెట్రో వాటర్ ఎస్ఈ సుదర్శన్, మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, ఇరిగేశన్ అధికారులు, రైతులు ఉన్నారు.
Spread the love