నవతెలంగాణ – హైదరాబాద్ : లోక్‌సభ ఫలితాల్లో బీఆర్ఎస్ కు ఎన్ని సీట్లయినా రావొచ్చని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ‘ఇవాళ సీఎం సొంత జిల్లాలోనే గెలిచాం. రాకేశ్ రెడ్డి కూడా గెలవబోతున్నారు. లోక్‌సభ సీట్లలో ఎన్ని వస్తాయో చూద్దాం. ఒకడు మనకు 11 వస్తాయన్నాడు. ఇంకొకడు ఒకటే వస్తదన్నాడు. మరొకడు 2-4 అన్నాడు. ఇదో పెద్ద గ్యాంబ్లింగ్ అయిపోయింది. మంచి ఫలితాలు వస్తాయని ఆశిద్దాం. 11 వస్తే పొంగిపోయేది లేదు. 2 వస్తే కుంగిపోయేది లేదు’ అని తెలిపారు.