మహారాష్ట్ర బస్సు ప్రమాదఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి

నవతెలంగాణ హైద‌రాబాద్‌: మ‌హారాష్ట్ర‌లోని స‌మృద్ధి – మ‌హామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై తెల్ల‌వారుజామున జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 25 మంది సజీవ‌ద‌హ‌న‌మైన విష‌యం తెలిసిందే. ఆ బ‌స్సు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌కు బీఆర్ఎస్ జాతీయ అధ్య‌క్షులు, సీఎం కేసీఆర్ సంతాపం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
కాగా, బ‌స్సు డ్రైవ‌ర్‌ను, కండ‌క్ట‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్టు మ‌హారాష్ట్ర మంత్రి గిరీశ్ మ‌హాజ‌న్ తెలిపారు. బ‌స్సు టైరు పేల‌డం వ‌ల్ల ప్ర‌మాదం తీవ్ర స్థాయిలో ఉంద‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌యాణికులు నిద్ర‌లో ఉన్న కార‌ణంగా 25 మంది స‌జీవ ద‌హ‌నం అయ్యారు. బోల్తా కొట్టిన బ‌స్సు డీజిల్ ట్యాంక్ లీకైంద‌ని, దాని వ‌ల్ల ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Spread the love